Latest News

సిరిసిల్లలో కేటీఆర్‌కి జెల్ల!

posted on: Mar 24, 2014 2:08PM

 

 

 

సీమాంధ్రలను తిట్టిపోయడంలో తన తండ్రి కేసీఆర్‌ కంటే నాలుగు తిట్లు ఎక్కువే చదివిన ఘనాపాటి కేటీఆర్ ఈసారి ఎన్నికలలో కూడా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయాలని ఫిక్సయ్యాడు. నిన్నటి వరకూ తన గెలుపు చాలా ఈజీనే అనే ఫీలింగ్‌లో వున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం పరిస్థితి మారిపోయింది. ఈసారి ఎన్నికలలో కేటీఆర్ గెలుస్తాడా, లేదా అనే సందేహాలు బయల్దేరాయి. దీనికి కారణం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమ కార్యకర్త విమలక్క పోటీ చేయాలని ఆలోచిస్తూ వుండటమే.


ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే విమలక్కకి జనంలో మంచి ఫాలోయింగ్ వుంది. ఆషామాషీ వాళ్ళని ఈజీగా ఓడించే శక్తి కేటీఆర్‌కి వుందేమోగానీ, తన ప్రత్యర్థి విమలక్క అయితే మాత్రం ఆయనగారి బొచ్చెలో రాయిపడ్డట్టే.. నెత్తిన టెంకెజెల్ల పడ్డట్టే! విమలక్క గనుక సిరిసిల్ల నుంచి పోటీ చేయడం అంటూ జరిగితే అది కేటీఆర్‌కి గండంలా మారే ప్రమాదం వుంది. ఆమెకు ప్రజల్లో, కళాకారుల్లో, తెలంగాణ ఉద్యమ శక్తుల్లో వున్న బలం సామాన్యమైనది కాదు.

మొదటి నుంచీ కేసీఆర్, టీఆర్ఎస్‌లను వ్యతిరేకిస్తున్న తెలంగాణ శక్తులు అన్నీ విమలక్కకు మద్దతు ఇచ్చే అవకాశం వుంది. వాళ్ళందరూ సిరిసిల్లో  మోహరించికి కాలికి గజ్జె కట్టారంటే ఆ శబ్దానికే కేటీఆర్ ఎగిరిపోయే అవకాశం వుంది. తమ యువరాజుకి ఊహించని విధంగా ముంచుకొచ్చిన ఈ ప్రమాదం టీఆర్ఎస్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాన్ని మారిస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...