మాల్యా విల్లా సొంతం చేసుకున్న హీరో..

posted on: Apr 8, 2017 1:02PM

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లి పోయిన విజయ్ మాల్యా ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విల్లాను వేలం వేసిన సంగతి కూడా విదితమే. అయితే ఈ విల్లాను అమ్మడానికి బ్యాంకు అధికారులు పలుమార్లు వేలం నిర్వహించినా నిర్ణీత ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అది అలాగే ఉండి పోయింది. ఆఖరికి ఎట్టకేలకు ఈ విల్లా అమ్ముడుపోయింది. సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నారు. కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ విల్లాను చివరి సారి వేలంలో నిర్ణయించిన రిజర్వ్ ధర 85 కోట్ల నుంచి 81 కోట్లకు, చివరకు 73 కోట్ల రూపాయలకు తగ్గించిరు బేరం మాట్లాడుకుని సచిన్‌ జోషికి అమ్మేందుకు అంగీకరించారు. కింగ్ ఫిషర్ విల్లాను అమ్మిన విషయాన్ని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య ధ్రువీకరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...