అమెరికాలో మెరిసిన భారతీయ విద్యార్థులు

 

 

 

అమెరికాలో ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు బుధవారం ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను కైవసం చేసుకున్న జార్జియాకు చెందిన ఆనంద్ శ్రీనివాసన్(17), మేరీల్యాండ్‌కు చెందిన శౌన్ దత్తా(18)లు ఈ ఘనత సాధించారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు.


డీఎన్‌ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్‌వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు.