తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణం!
posted on: Feb 13, 2026 5:06PM

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మంచి విజయం సాధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచిందని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలు మనసు గెలుచుకోవటంతో కాంగ్రెస్ విఫలమైందని... ప్రజలు బాగా బుద్ధి చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌ను ఆదరించిన ప్రజలకు మాజీ మంత్రి ధన్యవాదలు తెలిపారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే మేము మీతో కలిసి రావాలని చెప్పి నేను ఎమ్మెల్యే సాంబశివరావుతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టడానికే ఈ ఆఫర్ మేము వాళ్ళకి ఇచ్చామని వెల్లడించారు. కొత్తగూడెంలో సీపీఐ 22, కాంగ్రెస్ 22 స్థానాలతో హంగ్ ఏర్పిడింది.
బీఆర్‌ఎస్ 8 స్థానాలు కీలకంగా మారింది. స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. ఇక్కడ కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్ అఫీషియోతో ఉపయోగించుకున్నా హంగ్ పరిస్థితే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్ తో సీపీఐ కోర్టులో బంతి ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆఫర్ ను సీపీఐ అంగీకరిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇదో సరికొత్త సమీకరణంగా మారుతుంది. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో నాటి నుంచి సీపీఐ కాంగ్రెస్ తో మద్దతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జత కడితే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది



.webp)


