కవితకు షాక్...జాగృతితో సంబంధం లేదు : ఫార్వర్డ్ బ్లాక్
posted on: Feb 13, 2026 3:46PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని తమ అభ్యర్థులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ తెలిపారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని, ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని ఛైర్మన్‌గా ఉన్న శ్రీనివాస్ స్ఫష్టం చేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో10 వార్డులకు గాను 8 చోట్ల సింహం గుర్తుపై గెలిచి సత్తా చాటారు.






