Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేశ్ చేతిలో వైసీపీ నేతల జుట్టు.. నిజమా..?
posted on: Jan 23, 2016 5:48PM

దేవుడి చుట్టూ ప్రదిక్షణాలు చేస్తే కనీసం పుణ్యం వస్తుంది.. కానీ పాపం వైసీపీ నేతలకు ఆ ఛాన్స్ కూడా లేదు.. ఎందుకంటే వారు ప్రదిక్షణాలు చేస్తున్నారు కానీ.. అది దేవుని చుట్టూ కాదు జైళ్ల చుట్టూ.. పాపం ప్రస్తుతానికి ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఈ పార్టీలోని నేతలందరూ వరుస పెట్టి కేసుల్లో ఇరుక్కొంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆపార్టీకి చెందిన మిథున్ రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే పోలీసులు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి.. ఈయక గారి దూకుడికి తగ్గట్టే పలు కేసుల్లో కేసులు నమోదయి.. ఆ కేసుల్లో భాగంగా జైళ్ల చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు.
అయితే వీరు ఇలా తీరిక లేకుండా జైళ్ల చుట్టూ తిరగడానికి గల కారణం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబుకి అంత తీరిక లేదని.. ఏపీ అభివృద్ది చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలతో బిజీగా ఉన్నారని.. అయితే దీనికి చంద్రబాబు కారణం కాదు కానీ.. కొడుకు లోకేశ్ కే కారణమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో టీడీపీ నేతలపై దూకుడిగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల గురించి రిపోర్టు తెప్పించుకొని మరీ యాక్షన్ తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాదు అందరి సంగతేమో కానీ చెవిరెడ్డి విషయంలో మాత్రం లోకేశ్ కాన్సట్రేషన్ పెట్టి రఫ్పాడించేందుకు చిత్తూరు - నెల్లూరు పోలీసులకు లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
కానీ దీనికి లోకేశ్ మాత్రం ఈ విషయానికి నాకు సంబంధం లేదని ఖండిస్తున్నా తాను చేసిన ఒక వ్యాఖ్య వల్ల అది నిజమనే తెలుస్తోంది. అదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వరుసగా కేసులు పెట్టి జైళ్ల చుట్టు తిప్పడంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన గత ప్రభుత్వాలు పెట్టిన కేసులే చెవిరెడ్డిపై 45 ఉన్నాయని అందుకే జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అంతే లోకేశ్ నెంబరు తోసహా చెబుతుంటే సరికి అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇంత కరెక్ట్ గా నెంబరు తోసహా చెబుతుంటే లోకేశ్ మొత్తం రిపోర్టు తెప్పించుకుని ఆడిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమేంతుందో తెలియదుకాని ఈ వార్తల వల్ల వైసీపీ నేతలు మాత్రం కాస్త ఆలర్ట్ అయ్యారంట. మొత్తానికి లోకేశ్ కు వైసీపీ నేతల పిలకలు బానే దొరికినట్టున్నాయి.



.jpg)


