సారీ.. శ్రీకాంతాచారీ!

posted on: Apr 5, 2014 5:47PM

 

 

 

తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతచారికి ఇప్పుడు తమ మనసులలో సారీ చెబుతున్నారు. అమరవీరుడిగా నిలిచిన శ్రీకాంతాచారి కుటుంబానికి టీఆర్ఎస్ చేస్తున్న అవమానాన్ని అడ్డుకోలని తమ అశక్తతను తామే నిందించుకుంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ఎన్నికలు వచ్చినవేళ ఆ ప్రస్తావనే తేలేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత దగ్గరకి వెళ్ళి టిక్కెట్ అడిగితే టిక్కెట్ ఇవ్వనని ముఖంమీదే చెప్పేశాడు.

 

టీఆర్ఎస్ నేత అసలు స్వరూపం తెలుసుకుని బాధపడిన శంకరమ్మ నాకు టిక్కెట్ ఇవ్వకపోతే నా కొడుకులాగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తేగానీ టిఆర్ఎస్ టిక్కెట్ ఇస్తానని ప్రకటించలేదు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ టిక్కెట్‌ని శంకరమ్మకి ఇస్తున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదు.



ఈ సీట్ తనకు వద్దని శంకరమ్మ మొత్తుకున్నా వినకుండా తొలి జాబితాలో ఆమె పేరుని ఆ స్థానానికే ప్రకటించారు. అదేంటని శంకరమ్మ ప్రశ్నిస్తే పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరవీరుల కుటుంబాల విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి దారుణంగా వుందని అంటున్నారు. శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి, బలిదానానికి టీఆర్ఎస్ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...