Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజధాని విషయంలో జగన్ వైఖరి వెనుక రహస్యమేంటంటే?
posted on: Jul 9, 2026 4:25PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో తీర్మానం పూర్తయి, రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చినప్పటికీ.. జగన్ మాత్రం తన విధానం అమరావతి కాదు మావిగాన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అని ఒకసారి విజయవాడ అంటూ మరోసారి మాట్లాడుతూ.. తన గందరగోళాన్ని తానే బయటపెట్టుకుంటూ, ప్రజలను కూడా గందరగోళంలో పడేయాలని ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పొలిటికల్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి తెలుగువన్‌తో మాట్లాడుతూ జగన్ వైఖరి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను, రాజకీయ వ్యూహాలను బయటపెట్టారు.
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వైసీపీ నాయకులు ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధాని చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, రైల్వే కనెక్టివిటీ, నాగార్జున సాగర్ కుడి కాల్వ నీటి లభ్యత వంటి సానుకూల అంశాలు, రాయలసీమకు కూడా దగ్గరగా ఉంటుందని భావించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కాదని మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన జగన్, గడిచిన ఐదేళ్ల పాటు చంద్రబాబు నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాల నుంచే పరిపాలన సాగించారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో రాజధాని పేరిట 30 వేల ఎకరాలు సేకరించకపోగా.. కేవలం ఋషికొండపై వందల కోట్ల రూపాయలతో పర్యాటక భవనాలను కూల్చి తన కోసం ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలలో మూడు రాజధానుల అంశంపైనే ప్రజలు వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి తిరస్కరించినా జగన్ తీరు మారలేదన్నారు.
ప్రస్తుతం జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ అనే ఆలోచన ఆయన సొంతం కాదనీ.. తిరుపతికి చెందిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇచ్చిన ఐడియా అని మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నిర్మిస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుందనే ఏకైక వ్యక్తిగత ద్వేషం, అసూయతోనే జగన్ ఈ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని విశ్లేషించారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ నిర్మాతగా చంద్రబాబు పేరు ఎలా చిరస్థాయిగా నిలిచిపోతుందో.. అమరావతి విషయంలో కూడా చంద్రబాబు పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనీ, ఒక రాజధాని నగరాన్ని నిర్మించిన వ్యక్తిగా చంద్రబాబు కీర్తి శాశ్వతంగా నిలుస్తుందన్న భయం, ఆసూయా, ద్వేషం కారణంగానే జగన్ అమరావతిపై విషం చిమ్ముతున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు.
అమరావతి సెల్ఫ్ సస్టేయినబుల్ క్యాపిటల్ అన్నారు. అమరావతి కోసం తీసుకువచ్చే అప్పులను అమరావతే తీర్చుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రజలపై భారం పడదనే సత్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
YS Jagan Mohan Reddy, Amaravati capital controversy, Madhusudan Reddys analysis, Chandrababu Naidu, AP capital, Mavigan slogan, Telugu One






