Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుప్రీంకోర్టును ఆశ్రయించిన శశికళ, సుబ్రహ్మణ్యస్వామి...
posted on: Feb 13, 2017 1:43PM

తమిళనాడు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పటి వరకూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వద్దని పిటిషన్ దాఖలు కాగా ఇప్పుడు శశికళ కూడా సుప్రీంకోర్టును అశ్రయించారు. ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ చేస్తున్నజాప్యంపై పిటిషన్ దాఖలు చేశాడు. తగినంత ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున శశికళకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.


.jpg)



