Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆరెస్సెస్ తీరు మార్చుకోనుందా!
posted on: Mar 12, 2016 11:26AM
.jpg)
ఈ ఏడాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అంతగా కలిసి వస్తున్నట్లు లేదు. మొదట హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంచలనాన్ని సృష్టించింది. ఇందులో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ మీద విమర్శలు వచ్చాయి. ఆ తరువాత జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సమావేశం తరువాత ఏబీవీపీ తీరు వల్ల కూడా, ఆరెస్సెస్‌కు వెనుకబడిన వర్గాలు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాము దళితులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఆరెస్సెస్ స్పష్టం చేయక తప్పని స్థితి వచ్చింది.
దాంతో ఆ సంస్థ వెనుకబడిన వర్గాల నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా జేఎన్‌యూలో ఏబీవీపీ సంఘం ఉపాధ్యక్షుడు మనుస్మృతిని తగలబెట్టారు. ఇందులోని విషయాలు మహిళలకు, దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నది సదరు ఉపాధ్యక్షుల ఉవాచ. అంతేకాదు! అంబేద్కర్ 125వ జయంతి ఉత్సావాల సందర్భంగా ఈ ఏడాది కులవివక్షకు వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉంటామని ఆరెస్సెస్ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.



.jpg)


