Latest News

కర్రెగుట్టలపై ఎగిరిన జాతీయ జెండా

posted on: Jan 26, 2026 6:39PM

 

మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల పరిధిలోని పామునూరు గ్రామ సమీపంలో ఉన్న కర్రెగుట్టపై గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పామునూరు గ్రామస్తులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ్, సెకండ్ కమాండెంట్ పంచమ్ లాల్, ఏఎస్‌ఎంఓ డాక్టర్ తారకేశ్వరి, అసిస్టెంట్ కమాండెంట్లు అనీష్, శ్రీనివాస్, డీఎస్పీ ప్రసిద్ధు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...