రాయ‌పాటి యాక్షన్.. రామ్మోహన్ నాయుడి రియాక్షన్..

posted on: Jan 9, 2016 2:50PM

ద‌శాబ్దాలుగా పార్ల‌మెంటేరియ‌న్‌గా ఉన్న సీనియ‌ర్ ఎంపీ అయిన రాయ‌పాటిపై.. తొలిసారిగా ఎంపీగా గెలిచి.. ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్న యువ ఎంపీ.. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  విజయవాడలో టీడీపీ ఎంపీలకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న రాయపాటి విశాఖ జోన్ ఉద్దేశించి.. తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకు.. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రైల్వే జోనులు ఏర్పాటు చేయాలని అన్నారు. అంతే దీంతో రామ్మోహన్ నాయుడికి చిర్రెత్తుకొచ్చినట్టుంది.. రాయపాటిపై ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుఫాన్లు రావా.. తుఫాన్ల పేరు చెప్పి రైల్వేజోన్‌ను కూడా ఎగరేసుకుపోదామనుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నారు? అని మండిపడ్డారంట. అంతే అక్కడునన్న నేతలు మొదట రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు షాక్ తిన్న ఆతరువాత తను మాట్లాడినదాంట్లో కూడా నిజం ఉందని గ్రహించి అతనిని ప్రశంసించారంట. రామ్మోహన్ నాయుడికి కోరస్ గా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వెంటనే అందుకుని ”బాధ్యతగా మాట్లాడండి.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం” అని హితవు పలికారట.

మొత్తానికి పార్లమెంట్ లో ఎలా అయితే తన ప్రసంగంతో అందరిని మెప్పించాడో.. ఇప్పుడు కూడా అలానే అందరి ప్రశంసలు అందుకొని యువకెరటంలా రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నాడు. మరి దీనికి రాయపాటి ఎలాంటి యాక్షన్ చూపిస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...