24 గంటలు అయిపోయాయి హరీష్‌రావ్?!

posted on: Apr 28, 2014 6:53PM

 

 

 

పవన్ కళ్యాణ్ హరీష్ రావు మీద కొన్ని ఆరోపణలు చేశాడు. హరీష్ రావుకి బొత్సతో వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించాడు. వాటికి హరీష్ రావు వీరావేశంగా స్పందించాడు. తనకు బొత్సతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని రంకెలేసి మరీ చెప్పాడు. తన లాంటి అమాయకుడి మీద పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని హరీష్ విరుచుకుపడ్డాడు.


పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బుద్ధి తెచ్చుకుని, 24 గంటల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తాను పవన్ కళ్యాణ్ మీద పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించేశాడు. హరీష్ రావు ఈ భారీ ప్రకటన చేసి 24 గంటలు ఎప్పుడో గడిచిపోయాయి. ఇంతవరకు హరీష్ రావు పవన్ కళ్యాణ్ మీద పరువునష్టం దావా వేయలేదు. ఎందుకు వేయలేదో.. తనకు పరువే లేదని హరీష్ అనుకున్నాడో ఏంపాడో. అయినా రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా వుండటం మామూలే కదా. అందువల్ల హరీష్ రావు స్టేట్‌మెంట్‌ని మనమూ పట్టించుకోకుండా వుంటే సరి.

google-ad-img
    Related Sigment News
    • Loading...