ఢిల్లీ పేలుడు సూత్రధారులను వదిలే ప్రశ్నే లేదు.. మోడీ
posted on Nov 11, 2025 1:06PM

ఢిల్లీఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోమవారం (నవంబర్ 10) జరిగిన ఈ ఘటనలో13 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ... థింపూలో మాట్లాడుతూ ఈ పేలుడు వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.