Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంద్రాగస్టున కొత్త రేషన్ కార్డుల పంపిణీ.!
posted on: Aug 6, 2026 4:30PM

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది అర్హులైన లబ్ధిదారులకు పంద్రాగస్టున నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్య ప్రజలకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిం చనున్నారు. ఆగస్టు 15న తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
పాత కార్డులపై కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు, చిరునామా, సభ్యుల ఫొటోలు కనిపించేవి. అయితే ఇప్పుడు పంపిణీ చేయనున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలు , పేర్లు ఉండవు. దానికి బదులుగా ప్రతి కార్డుపై ఒక ప్రత్యేకమైన విశిష్ట సంఖ్య, క్విక్ స్కానింగ్ కోసం ఒక బార్‌కోడ్‌ను మాత్రమే ఉంటుంది. ఈ అధునాతన బార్‌కోడ్ ద్వారా రేషన్ దుకాణాల్లో లేదా అధికారుల వద్ద డిజిటల్ స్కేనర్ సహాయంతో బార్‌కోడ్‌ను స్కాన్ చేయగానే, లబ్ధిదారుల కుటుంబానికి చెందిన సంపూర్ణ వివరాలు, సభ్యుల పేర్లు, ఆధార్ సీడింగ్ సమాచారం ఆన్‌లైన్ డేటాబేస్ ద్వారా డిస్ప్లే అవుతాయి.
ఈ వినూత్న బార్‌కోడ్ విధానం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. నకిలీ కార్డుల నిరోధానికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా రేషన్ సరుకులు అందేలా చూడటానికి ఈ డిజిటల్ డిజైన్ దోహదపడు తుందంటున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాలను పారదర్శకంగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను ఆమోదించి, ఆగస్టు 15 నాటికి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.
new ration cards in Telangana, Revanth Reddy ration card distribution, August 15 ration cards, Barcode ration card, Debit Card Size


.webp)



