బ్లాక్ మనీ నోట్లతో... డిసెంబర్ చలి మంటలేసుకోవాల్సిందే!

posted on: Nov 9, 2016 8:28AM

మోదీ నిర్ణయం నిన్న విన్న వారందరికీ షాకిచ్చింది. కాని, ఇవాళ్ల మెల్లమెల్లగా ఎఫెక్ట్ ఏంటో అవగాహనకు వస్తోంది. 500, 1000 నోట్లు రద్దు చేస్తే జరిగేదేంటి? 100 నోట్ల కోసం సామాన్య జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది! ఇంతే అనుకున్నారు అంతా... కాని, మ్యాటర్ అంత కంటే చాలా ఎక్కువే వుంది...

మోదీ ఒక్క మాటతో డమ్మీ అయిపోయిన పెద్ద నోట్ల విలువ ఎంతో తెలుసా? 15లక్షల కోట్లు! చెలామణిలో వున్న నోట్ల సాధారణ విలువ 2320 కోట్లు. కాని, అమెరికన్ డాలర్ తో మన మారకం విలువ పెరుగుతూ, తరుగుతూ వుంటుంది కాబట్టి మార్కెట్ విలువ 15లక్షల కోట్లు అవుతుంది. ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడు లిట్మస్ పరీక్ష ఎదుర్కోబోతోంది. డిసెంబర్ దాటుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్లేలోపు ఈ భారీ మొత్తం అటు ఇటో తేలిపోనుంది!

500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో ఇప్పుడు అవ్వి వున్న వారంతా బ్యాంక్ లకు పరుగులు తీయాలి. అంటే దాచుకున్నదంతా లీగల్ చేసుకోవాలన్నమాట. అదీ ఆధార్ లాంటి గుర్తింపు కార్డు చూపి మరీ బ్యాంక్ లో వేసుకోవాలి. ఇక్కడే బ్లాక్ డాగ్స్ అడ్డంగా దొరికిపోయేది. ఇంత కాలం పరుపుల కింద, బీరువాల్లో, ఓవర్ హెడ్ ట్యాంకుల్లో దాచుకున్నదంతా బ్యాంక్ లకు తీసుకువెళ్లలేరు. అలాగని డిసెంబర్ దాటితే వాటికి చిత్తు కాగితలంత విలువ కూడా వుండదు. ఇదే మోదీ నిర్ణయంలోని అసలు మతలబు. పొగబెట్టి కలుగుల్లోని ఎలుకల్ని బయటకి లాగటమే లక్ష్యం.

15లక్షల కోట్లలో ఎంత వరకూ లీగలైజ్ అవుతుందో డిసెంబర్ తరువాత గాని తెలియదు. కాని, అంతలోపు మాత్రం పెద్ద దెబ్బ పడే శాల్తీలు బ్లాక్ మనీ డాన్స్ , దేశ ద్రోహ అంతర్గత ఉగ్రవాదులు, ఎన్జీవోల ముసుగులో దందాలు చేసే వారు... వీళ్లంతా! మొత్తానికి మోదీ పెద్ద నోట్ల రద్దు నీర్ణయం... సామాన్యులకి కాదుగాని... చాలా మంది దొంగలకి, దొరలకి డిసెంబర్ చలి లేకుండా చేయనుంది! వేడి పుట్టించి ఒళ్లు కందిపోయేలా చేస్తుంది!

google-ad-img
    Related Sigment News
    • Loading...