మోదీ చెప్పిన పిట్టకథ!

posted on: Mar 4, 2016 9:49AM

మొన్నటికి మొన్న మోదీ ఎవరి మాటా వినడంలేదనీ, తన మనసుకి ఏది తోస్తే అలా ప్రవర్తించేస్తున్నారంటూ రాహుల్ గాంధి విరుచుకుపడిన విషయం తెలిసిందే! పాకిస్తాన్‌కు వెళ్లాలన్నా, కీలక ఒప్పందాలు చేసుకోవాలన్నా ప్రధానమంత్రి తన క్యాబినెట్‌ సహచరులను సైతం సంప్రదించడంలేదని రాహుల్‌గారు తీవ్రంగా విమర్శించారు. తాము ఎంతో కష్టపడి పాకిస్తాన్‌ను పంజరంలో బంధిస్తే మోదీ దాన్ని విడిపించేశారంటూ ఆక్షేపించారు. రాహుల్‌ ఆరోపణలన్నింటికీ మోదీ నిన్న తనదైన శైలిలో జవాబిచ్చారు.

 

అసలు విమర్శించే అవకాశం తాను ఇవ్వడం వల్లనే కదా, రాహుల్‌ అన్నేసి మాటలు అనగలిగేది అన్న అర్థం వచ్చేలా ఓ పిట్టి కథను చెప్పారు.... స్టాలిన్‌ మరణించిన తరువాత ఆ దేశ పాలనా బాధ్యతను చేపట్టిన నికితా కృశ్చేవ్‌ ఏ మూలకి వెళ్లినా స్టాలిన్‌ను విమర్శిస్తూనే ఉండేవారట! అలాంటి ఓ సందర్భంలో ఒక యువకుడు లేచి నిలబడి, ఇన్నాళ్లూ మీరు స్టాలిన్‌తో కలిసే పనిచేశారు కదా! అప్పుడు ఎందుకు ఈ విమర్శలు చేయలేదు? అని అడిగాడట. దానికి కృశ్చేవ్‌ బదులిస్తూ ‘స్టాలిన్ బతికుండగానే నేను విమర్శించాలనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. నీకు మాత్రం నేను బతికుండగానే విమర్శించే అవకాశం ఉంది’ అని బదులిచ్చాడట కృశ్చేవ్‌. ప్రతిపక్షాలు తనని నిర్భయంగా ప్రశ్నించగలుగుతున్నాయనీ, కానీ కొందరిని మాత్రం ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయలేరనీ కాంగ్రెస్‌ అధినాయకత్వానికి చురకలు అంటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...