ముస్సోరీలో తెలుగు టెక్కీ మిస్టరీ డెత్... భర్తతో విహారయాత్రలో విషాదం

posted on: Jun 16, 2026 9:08PM

 

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా  పనిచేస్తుండగా, ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్ పుణెలో ఐటీ ఉద్యోగిగా ఉన్నారు. గత ఏడాది నవంబర్‌ 8న వివాహం చేసుకున్న ఈ దంపతులు విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

జూన్ 14న ముస్సోరీ-ధనౌల్టీ రోడ్డులోని టిప్రీ ప్రాంతంలోని ఓ హోమ్‌స్టేలో బస చేసిన దంపతులు రాత్రి మద్యం సేవించినట్లు సమాచారం. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి గాయత్రి గదిలో స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించిన భర్త శ్రీచరణ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయత్రి మృతిచెందినట్లు నిర్ధారించారు. గదిలో గాయత్రి మృతదేహం నగ్నంగా ఉండటం, ముక్కు నుంచి రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు కనిపించడం, మంచంపై రక్తపు మరకలు ఉండటంతో కేసు మిస్టరీగా మారింది. 

గదిలో లభించిన మద్యం సీసాలు, ఆహార పదార్థాలు తదితర వస్తువు లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష లకు పంపించారు. హోమ్‌స్టే సిబ్బంది వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులను కూడా పరిశీలి స్తున్నారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదికతో పాటు ఫోరెన్సిక్ ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీ సులు తెలిపారు. ప్రమాద వశాత్తు మరణమా, ఆత్మ హత్యా, సహజ మరణమా లేదా మరేదైనా అనుమానాస్పద పరిస్థితుల ఫలితమా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...