Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంటలిజన్స్ వైఫల్యమే కారణమా!
posted on: Feb 1, 2016 3:43PM

లక్షలాదిమంది ప్రజలు ఒకేచోటకి చేరుకుంటున్నారు. అదీ ఉద్యమం చేసే ఉద్దేశంతో! మరి ఇంతమంది ఒకచోటకి చేరుకుంటే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న విషయం ఆంధ్రా ఇంటలిజన్స్ పసిగట్టలేకపోయిందా! వారిని అదుపు చేసేందుకు తగినంత పోలీసు బలగం ఉండాలనీ, ముందుగానే ఉద్యమ పెద్దలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వానికి సూచించలేకపోయిందా. తుని ఘటన తరువాత ఇప్పుడు అందిరి మనసులోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే! ఇంటెలిజన్స్ కనుక ప్రభుత్వాన్ని ముందుగా హెచ్చరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! అలా జరక్కపోవడంతో గుంపుల కొద్దీ వస్తున్న జనానికి కేవలం గుప్పెడు మంది పోలీసులు మాత్రమే ఎదురొడ్డి తన్నులు తినాల్సిన పరిస్థితి దాపురించింది. పైగా జాతీయ రహదారికీ, రైలు పట్టాలకీ దగ్గరగా ఈ సభను ఎంచుకోవడంలోని ఆంతర్యం కూడా బహుశా ఇంటలిజన్స్ గ్రహించలేకపోయింది. ఫలితం!






