Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పక్కా ప్లాన్ ప్రకారమే మథుర అల్లర్లు.. !
posted on: Jun 4, 2016 12:01PM
.jpg)
మథురలో జరిగిన హింసాత్మక ఘటనలో ఎస్పీ సహా 24 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మథురలోని జవహార్ భాగ్ ప్రాంతంలో అక్రమణదారులు ఆక్రమించిన 200 ఎకరాలకు పైగా భూమిని తొలగించడానికి అహ్మదాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు అక్రమణ దారులను తొలగించేందుకు వెళ్లారు. దీంతో పోలీసులపై వారు విచక్షణారహితంగా దాడి చేయడంతో చాలామంది మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.
అయితే ఈ అలర్లు వెనుక అసలు కారణాలు మాత్రం చిన్నగా బయటపడుతున్నాయి. అక్రమణదారులు పక్కా ప్లాన్ తోనే పోలీసులపై దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వస్తారని ముందే పసిగట్టిన అక్రమణదారులు వారిపై దాడి చేయడానికి అన్ని ముందుగానే సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకనుగుణంగా భారీ కసరత్తే చేశారంట. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నారంట.. అంతేకాదు వెయ్యి గ్యాస్ సిలిండర్లు, 200 గ్రనేడ్లను సిద్ధం చేసుకున్నారు. తుపాకులు, పదునైన కత్తులను తెచ్చిపెట్టుకున్నారట. ఇక ఎప్పుడైతే పోలీసులు వారిపై దాడి చేయడానికి వచ్చారో.. మూడు వేలకు మంది పైగా విధ్వంసకారులు వారిపై దాడి చేశారు. అయితే వీరి వ్యూహాలను పసిగట్టలేని కారణంగానే పోలీసులకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సహా విధ్వంసకారుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయని చెప్పడం గమనార్హం. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 400 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


.jpg)



