చెల్లని నోట్లతో... ఇక అన్నల ఆటలు చెల్లా?

posted on: Nov 14, 2016 4:35PM

 

మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పెట్రోల్ లో పడ్డ నిప్పు రవ్వలా తయారైంది! పైకి సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు , ఏటీఎంల ముందు బారులు తీరుతున్నట్టూ కనిపిస్తుంది కాని ... లోలోన పెద్ద పెద్ద వారు తెగ మథన పడిపోతున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ మొదలు గల్లీలోని కేడీగాళ్ల దాకా అందరూ పాత నోట్లు తిరిగి అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సమస్య చేతిలో డబ్బులు లేకపోవటమా? పాతవి చెల్లకపోవటమా? రెండోదే అసలు ప్రమాదం అంటూ లోలోపల బిక్క చచ్చిపోతున్నారు చాలా మంది... 


500, 1000 నోట్లు చెల్లకపోవటం వల్ల ఎవరెవరు పెద్ద మొత్తంలో నష్టపోతారు? వ్యాపారస్తులు, పొలిటీషన్స్, సెలబ్రిటీస్... ఇలాంటి వారు!కాని, మీరు అస్సలు ఊహించని మరో వర్గం కూడా మోదీపై కుతకుత ఉడికిపోతోంది. నల్లధనం పై పోరు పేరుతో తమ ఆయువుపట్టు మీద కొట్టాడని పిచ్చెక్కిపోతోంది. అదే... భారత మావోయిస్టు పార్టీ! 


అవును... నక్సల్స్ కూడా ఇప్పుడు దిక్కుతోచక సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే, వాళ్ల దగ్గర కూడా ఇంత కాలం నుంచీ వున్నది పాత 500, 1000 నోట్లే! కొత్తవి ఎలా వస్తాయి? మావోయిస్టులు తమ ప్రభావిత ప్రాంతాల్లో చేసిన వసూళ్లు దాదాపు 7వేల కోట్లు వున్నాయట. బస్తర్ ప్రాంతంలో వాళ్లు డంప్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇంత పెద్ద మొత్తం ఇప్పుడు బ్యాంకుల్లో వేసుకుంటే తప్ప కొత్త నోట్లు రావు. కాని, అలా చేసేందుకు అదంతా వైట్ మనీ కాదు. పైగా నిషేధిత సంస్థ అయిన మావోయిస్ట్ పార్టీ జనంలోకి వచ్చి క్యూలలో నిలబడి డబ్బులు డిపాజిట్ చేయలేదు. మొత్తంగా చూస్తే అన్నల ఆర్దిక మూలాలకి కన్నం పడ్డట్లే కనిపిస్తోంది! ఈ ఆర్దిక దాడి నుంచి మావోలు ఎలా తప్పించుకుంటారో చూడాలి! మొన్న అంతా సవ్యంగా వున్నప్పుడే భీకరమైన ఎన్ కౌంటర్లో చాలా మంది ప్రముఖ నేతల్ని కోల్పోయింది పార్టీ. ఇప్పుడు ఈ ఆర్దిక ఒత్తిడి ఎర్ర సైన్యానికి ఊపిరాడకుండా చేయవచ్చు. 


పోలీసులు మాత్రం మావోల 7వేల కోట్లు ఎట్టి పరిస్థితుల్లో వైట్ కానీయమని గట్టిగా చెబుతున్నారు. మరి అతి త్వరలో మావోయిస్టులు బలహీనంగా వున్న ఈ క్షణంలోనే గవర్నమెంట్ ప్రత్యక్ష దాడులు మొదలు పెడితే? అటు సీమాంతర ఉగ్రవాదులతో జరుగుతున్నట్టే దారుణ రణరంగం ఇంటిలోని తీవ్రవాదులతోనూ జరుగుతుంది. అదే అయితే సాధ్యమైనంత తక్కువ రక్తపాతంతో ధర్మం గెలవాలని కోరుకుందాం.... 


 

google-ad-img
    Related Sigment News
    • Loading...