ఇరాక్: పేలుళ్ళకు బెదిరిన కేరళ నర్సులు!
posted on: Jun 28, 2014 3:56PM

ఇరాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రవాద గుప్పిళ్ళలో వున్నాయి. ఇరాక్‌లో వున్న ఇతర దేశస్థులు వెంటనే దేశం విడిచిపోవాలని తీవ్రవాదులు ఎప్పుడో హుకుం జారీ చేశారు. వాళ్ళు వెళ్ళమని అనకపోయినా ఇరాక్‌లోని అనేకమంది భారతీయులు సాధ్యమైంనంత త్వరగా ఇరాక్‌ని విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశారు. అయితే కేరళలోని త్రికిత్ నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు మాత్రం తాము ఇరాక్ వదిలి రామని, ఇక్కడ గాయపడిన వారికి చికిత్స చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటామని గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఇరాక్‌లో ఉద్రికత్తలకు కారణమైన తీవ్రవాదులు కూడా తాము తమ దేశంలో వున్న కేరళ నర్సులను ఏమీ అనబోమని, వారికి ఎలాంటి హానీ చేయబోమమని, గాయపడిన వారికి చికిత్స చేయడానికి తాము ఎలాంటి ఆటంకమూ కలిగించబోమని చెప్పారు. అవసరమైతే కేరళ నర్సులకు తామే జీతాలు కూడా ఇస్తామని ప్రకటించారు. తీవ్రవాదుల నుంచి ఈ హామీ రావడంతో కేరళ నర్సులు ఇరాక్‌లోనే ఉండిపోయి చికిత్స చేస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఇరాక్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజంతా బాంబు పేలుళ్ళు వినిపిస్తూనే వున్నాయి.
ఎక్కడో ఒకచోట బాంబు దాడులు జరుగుతూనే వున్నాయి. ఈ బాంబు పేలుళ్ళ శబ్దాలు కేరళ నర్సులకు భయం కలిగిస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తిక్రిత్ నగరంలో వున్న 46 మంది నర్సులలో 35 మంది నర్సులు ఇండియాకి వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. వాళ్ళంతా తమ లగేజీని సర్దుకుని తమని ఇండియాకి ఎవరు పంపిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 11 మంది నర్సులు మాత్రం ఇరాక్‌లోనే వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.



.jpg)
.jpg)

.webp)



