Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భగత్‌సింగ్ చుట్టూ రాజకీయాలు మొదలు
posted on: Mar 23, 2016 10:56AM

భగత్‌సింగ్‌ను కన్నయాకుమార్‌తో పోలుస్తూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఓ తేనెతుట్టుని కదిపినట్లున్నాయి. శశిథరూర్ వ్యాఖ్యలు కలిగించిన వేడిని చల్లార్చేందుకు, కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆ పార్టీ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ‘భగత్‌సింగ్ ఒక్కడేననీ, ఆయనను వేరెవ్వరితోనూ పోల్చడం సరికాదని’ పేర్కొన్నారు. పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వారి హీరో అయిన భగత్‌సింగ్‌ను వివాదంలోకి లాగడం ఆ పార్టీకి తప్పకుండా నష్టం కలిగించవచ్చు. ఇక కమ్యూనిస్టులు కూడా ఈ వ్యాఖ్యలతో కంగుతిన్నారు. ఆది నుంచీ కూడా వారు భగత్‌సింగ్‌ను, తమ వర్గానికి చెందిన నేతగా భావించారు. ఇప్పుడు కన్నయాతో పోల్చడంతో ఆయన స్థాయి తగ్గించినట్లైపోయింది. ఇక బీజేపీ మాత్రం ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే కన్నయతో భగత్‌సింగ్‌ను పోల్చడం గురించి బీజేపీ ఇప్పటికే మండిపడుతోంది. మార్చి 23 భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజు కావడంతో, ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా, భగత్‌సింగ్ త్యాగాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తామని ఆ పార్టీ చెబుతోంది. మరి ఈ వివాదం చిలికి చిలికి ఎక్కడికి దారితీస్తుందో, ఎన్ని ఎన్నికలలో ప్రభావం చూపిస్తుందో చూడాలి!


.jpg)
.jpg)


