గాలికిపోయే కంప... ఎన్టీఆర్ నెత్తిన పడిందా?

posted on: Aug 27, 2016 1:19PM

తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అనే పవన్ అభిమాని హత్యకి గురయ్యాడు. అతడ్ని చంపింది ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నారు చాలా మంది. ఇందులో ఖచ్చితమైన ఆధారాల వంటివేం లేవు. పోలీసులు సదరు మర్డర్ చేసిన వాడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తేనే నిజాలు బయటపడతాయి. అదీగాక అతడు ఎన్టీఆర్ ఫ్యానే అయినా ఆవేశంలో ఆ వీరాభిమాని చేసిన అఘాయిత్యానికి ఎన్టీఆర్ బాధ్యత ఏముంటుంది? ఏమీ వుండదు...


జరిగిన విషాదంలో తన ప్రమేయం ఏమీ లేకున్నా, జూనియర్, సరిగ్గా జనతా గ్యారేజ్ టైంలో ఈ గొడవ వల్ల డిస్టబ్ అవుతున్నాడని టాక్. తన ఫ్యాన్ చనిపోయాడని తెలిసిన వెంటనే పవన్ తిరుపతి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించాడు. అలాగే ఆర్దికంగా సాయం చేశాడని కూడా అంటున్నారు. అక్కడితో ఆగకుండా సభ పెట్టటానికి కూడా సిద్ధం అయ్యాడు. మొత్తంగా పవర్ స్టార్ తన డై హార్డ్ ఫ్యాన్ డెత్ ని పెద్ద హెడ్ లైన్ గా మర్చేశాడు.


ఒకవైపు పవన్ చకచకా దూసుకుపోతుంటే ఎన్టీఆర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో వున్నాడని ఆయన దగ్గర వారంటున్నారు. నిజంగా హత్య చేసింది ఎన్టీఆర్ ఫ్యానేనా కాదా అన్న క్లారిటీ కూడా లేకుండా తారక్ ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు వాల్డ్ వైడ్ గా జనతా గ్యారేజ్ మరి కొద్ది రోజుల్లోనే భారీ స్థాయిలో విడుదలవుతుండగా ఈ గొడవపై స్పందించటం అనవసరం అని కూడా కొందరు ఎన్టీఆర్ కి సలహా ఇస్తున్నారట...


మహేష్ కి శ్రీమంతుడు, ప్రభాస్ కి మిర్చీ లాంటి హిట్స్ ఇచ్చి మంచి ఊపు మీదున్న కొరటాల శివ జూనియర్ కి కూడా అదే రేంజ్ హిట్ జనతా గ్యారేజ్ తో ఇస్తాడని అందరి అంచన. ఇటువంటి సమయంలో ఈ అభిమానుల గొడవ రచ్చంతా జరగటం నిజంగా బాధాకరమే. అటు పాపం ఎన్టీఆర్ కి తన ప్రమేయం ఏమీ లేకుండానే వచ్చిపడ్డ అనవసర తలనొప్పి....

google-ad-img
    Related Sigment News
    • Loading...