Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా?
posted on: Aug 7, 2026 10:13AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా? పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవల కలిసి జగన్‌కు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జగన్ భద్రతలో కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ వైసీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలపైనా, రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులతో కేసులు బనాయిస్తున్నారని వారు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చినట్లు వారు ఆ తరువాత మీడియాకు తెలిపారు.
అయితే.. వైఎసీపీ ఎంపీల ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తోసిపుచ్చింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయమై స్పందిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించినట్లు వైసీపీయలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరుఫున భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేవని వంగలపూడి అనిత కండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వైసీపీ పర్యటనలు, సభలలో పోలీసు అనుమతులకు మించి భారీగా జన సమీకరణ చేస్తుండటమే అసలు సమస్య పేర్కొన్నారు. అనుమతించిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జనాన్ని వైసీపీ తరలించడంవల్లనే క్షేత్రస్థాయిలో భద్రతా నిర్వహణ పోలీసులకు సవాలుగా మారుతోందనీ, ప్రణాళికారాహిత్యమైన ఈ తీరు వల్లనే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
జగన్ భద్రత తగ్గించినట్లు స్పష్టమైన ఆధారాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రతకు సంబంధించి రాజకీయ విమర్శలు రావడం సహజమే అయినా.. ఈ విషయంలో రాజకీయ వివాదాల కంటే భద్రతా ఏజెన్సీల అంచనాలకే ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Jagans security, Amit Shah, YCP MPs, Vangalapudi Anita, Jagan security controversy, Andhra Pradesh politics, TeluguOne



.webp)


