Latest News

జగన్ పార్టీ అల్లర్ల వెనుక అసలు కారణమేంటి?

posted on: May 8, 2014 3:04PM

 

 

 

బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగు ప్రజలకి తమ విశ్వరూపం చూపించారు. జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో అయితే నాలుగైదు విశ్వరూపాలు ఒకేసారి చూపించారు. ఇక సీమాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ వైకాపా కార్యకర్తలు హింసాకాండకు పాల్పడటం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం చేశారు.

 

వైకాపా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు మాత్రం విజ్ఞతతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకే మద్దతు  ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ వైకాపా రాష్ట్రమంతటా ఎందుకు అరాచకం సృష్టించిందనే దానిమీద రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. లగడపాటి రాజగోపాల్‌ కూడా విలేకరుల సమావేశం పెట్టిమరీ  ఈ విషయాన్ని చెప్పారు. దాంతో వైకాపా పోలింగ్ శాతం తగ్గించడానికే అల్లర్లు సృష్ఠించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి.


పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరుగుతున్నాయన్న వార్తలు ప్రబలిన పక్షంలో ఓటింగ్‌కి బయల్దేరేవారు సహజంగానే ఎందుకొచ్చిన గొడవ అని ఆగిపోతారు. ఈ వీక్నెస్‌ని అర్థం చేసుకున్న వైకాపా సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో అల్లర్లు సృష్టించి వుండవచ్చని భావిస్తున్నారు. అయితే వైకాపా చేసిన అల్లర్ల కారణంగా కొంతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోయి వుండొచ్చు, కానీ భారీ పోలింగ్ మాత్రం జరిగింది. పోలింగ్ శాతం తగ్గించడానికి వైకాపా వేసిన పథకం పారలేదు

 

google-ad-img
    Related Sigment News
    • Loading...