జగన్‌కి ఓటింగ్ రూల్స్ తెలియవా?

posted on: May 7, 2014 3:26PM

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్జెంటుగా ఏదో ఒక స్టేట్‌కి ముఖ్యమంత్రి అయిపోవాలన్న తహతహే తప్ప మరే నాలెడ్జీ వున్నట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా ‘ఆంధ్రప్రదేశ్’కి ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక సీమాంధ్రని ఎలా డెవలప్ చేయాలనే విషయం మీద విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని పిలిపించడం తెలుసు. సీఎం అయ్యాక ఐదు సంతకాలు ఎక్కడెక్కడ చేయాలో తెలుసు. కానీ ఈ పెద్దమనిషికి ఓటు ఎలా వేయాలో మాత్రం తెలియకపోవడం బాధాకరం.

 

బుధవారం నాడు పులివెందుల నియోజకవర్గంలో జగన్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. పోలింగ్ బూత్‌లో జగన్ ఓటు వేస్తున్నప్పుడు ఆయన వెనుకే ఓ పోలింగ్ అధికారి, వైసీపీ పోలింగ్ ఏజెంట్ నిల్చుని జగన్ ఓటు వేయడాన్ని తనివితీరా చూసి తరించిపోయారు. ఇది రూల్స్ కి విరుద్ధం. ఓటరు ఓటు వేస్తూ వుండగా ఎవరూ చూడటానికి వీల్లేదు. తన పార్టీ కార్యకర్తల, ఓ పోలీసు అధికారి తన వెనుకే నిల్చుని తాను ఎవరికి ఓటు వేస్తున్నదీ కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తుంటే ఘనత వహించిన జగన్‌గారికి వారించాలని అనిపించలేదా? అక్కడే వున్న పోలింగ్ అధికారులు జగన్ వెనుక వున్న ఇద్దర్ని అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోవాలని చెప్పడం మరచిపోయారా?


చంద్రబాబు నాయుడు ఓటు వేసిన తర్వాత బయటకి వచ్చి, పోలింగ్ బూత్‌కి చాలా దూరంలో వుండి బీజేపీకి ఓటు వేశానని చెబితే జగన్ పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కూడా చంద్రబాబు ఓటు చెల్లదని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ఓటు చెల్లుతుందని చెప్పి భన్వర్ లాల్‌కి మొట్టికాయ వేయడంతో సైలెంటైపోయాడు. మరి చంద్రబాబు విషయంలో రూల్స్ మాట్లాడిన భన్వర్ లాల్, వైకాపా నాయకులు జగన్ ఓటేసిన విధానం చూసి ఏమంటారు? ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఏమంటారు? అన్నట్టు, బుధవారం ఉదయం నుంచే సాక్షి ఛానల్‌లో ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటు వేసిన విజువల్ పదేపదే చూపిస్తున్నారు. ఈ విజువల్స్ లో వైఎస్సార్ ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏంటంటే, అవినీతి అక్రమాల విషయంలో మాత్రమే కాకుండా నలుగురికీ కనిపించేలా ఓటు వేయడంలో జగన్ తండ్రి బాటలో నడుస్తున్నాడు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...