జగన్‌కి బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలవబోతోందా?

posted on: Jun 17, 2014 4:20PM

 

 

 

ఎన్నికల పుణ్యమా అని ఇంతకాలం బెయిల్ మీద తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వైసీపీ అధినేత జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వం వున్నంతకాలం సోనియా చెప్పినట్టు ఆడిన సీబీఐ ఇప్పుడు ఎన్డీయే హయాంలో కాస్తంత స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి విషయంలో చాలా కఠినంగా వుండే మోడీ హయాంలో సీబీఐ పనితీరు ఆశాజనకంగా వుండొచ్చన్న ఆశలు జనంలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ విచారణకు రానున్నాయి. ఈనెల 21 నుంచి జగన్ అక్రమాస్తులకు సంబంధించిన పది కేసులను విచారించడానికి సీబీఐ కోర్టు సన్నాహాలు చేస్తోంది. ఈ పది కేసుల్లోనూ జగన్ మొదటి ముద్దాయిగా వున్నారు. అరబిందో, హెటిరో ఫార్మాలకు సంబంధించిన కేసు ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ముందుకు రానుంది. గతంలో బ్యాడ్ టైమ్ నడిచినంతకాలం దాదాపు పదహారు నెలల పాటు జగన్ జైలులో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ కేసులు మళ్ళీ విచారణకు వస్తున్నాయి. ఈ కేసుల వల్ల జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ ప్రారంభం కాబోతోందా అనే సందేహాలు రాజకీయ పరిశీలకులలో కలుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో చూస్తే జగన్‌ భవిష్యత్తు ఎలా వుండబోతోందో అర్థమైపోతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...