Latest News

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ మార్చి 28న.. ఏయే జట్ల మధ్య అంటే?

posted on: Mar 13, 2026 10:18AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్  అభిమానులకు కక్కెక్కించే అప్ డేట్ వచ్చేసింది.   ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌విడుదలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది.  టోర్నీ ప్రారంభ మ్యాచ్‌పై  క్రికెట్ అభిమానుల్లో  ఆసక్తి నెలకొంది. హైదరాబాద్,  బెంగళూరు జట్టు మధ్య జరిగే ఈ మ్యాచ్ లో  హై వోల్టేజ్ పోరు ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే రెండు జట్లు కూడా టోర్నీ కోసం తమ సన్నాహాలను ప్రారంభించాయి. స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్ల మధ్య జరిగే ఈ తొలి మ్యాచ్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడం తథ్యం. ఐపీఎల్ షెడ్యూల్‌లో మిగతా మ్యాచ్‌ల వివరాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసారి ఐపీఎల్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...