Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెట్రో రైలు... ఒక జీవిత కాలం మిస్సు!
posted on: Oct 6, 2016 4:32PM

తెలుగు వారికి హైద్రాబాద్ గర్వకారణం! విభజన తరువాత తెలంగాణకు శాశ్వత రాజధానైనా తెలుగు వాళ్లు అందరూ భాగ్యనగరాన్ని ఎంతో కొంత ఓన్ చేసుకుంటారు. అందుకే, హైద్రాబాద్ లో మెట్రో అంటే అందరూ ఆనందపడ్డారు. కాని, ఇప్పుడు మెట్రో డౌట్ ఫుల్ గా మారిపోయింది. ఇదుగో వస్తుంది అదుగో వస్తుంది అంటూ ఉవ్విళ్లూరించిన రైలు కాస్తా ఎప్పుడు కూత పెడుతుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయింది!
మెట్రో ఆలస్యం అవ్వటం అందర్నీ నిరాశపరిచిందనే చెప్పాలి. నిజానికి ఇప్పటికే రెండు లైన్లలో మెట్రో పరుగులు పెట్టాల్సింది. నాగోల్ - మెట్టుగుడా, మియాపూర్ - ఎస్ఆర్ నగర్ మధ్య మెట్రో మెరిసిపోవాల్సింది. కాని, అలాంటిదేం జరగలేదు. జనం ఎప్పటిలాగే బస్సుల్లో వేలాడుతూ ఆఫీసులకి వచ్చి, వెళుతున్నారు. పైగా నగరం మొత్తం మెట్రో పనుల వల్ల ఇరుక్కుగా, దుమ్మూ, ధూళితో కరుగ్గా మారిపోయింది. అయినా రేపో, మాపో రైలొస్తుంది, రైరైమంటూ ఆకాశంలో తేలిపోతున్నట్టు మెట్రో పిల్లర్స్ పై వెళ్లిపోవచ్చని జనం భరిస్తున్నారు! ఈ మధ్య పడ్డ వర్షాలు హైద్రాబాదీలకు మెట్రో కష్టాలు మరింత ఎక్కువ చేశాయి. మెట్రో గుంతలు, మట్టితో పాటూ వర్షం నీళ్లు కూడా చేరి నరకం చూపిస్తున్నాయి...
మెట్రో రైల్ కల అంతకంతకు దూరం అవుతోంటే మీడియాలో వస్తోన్న వార్తలు జనాన్ని మరింత షాక్ కి గురి చేస్తున్నాయి. మెట్రో డెవలప్ చేయటానికి రంగంలోకి దిగిన ఎల్ అండ్ టీ ఇప్పుడు తన వాటా అమ్మేయాలని భావిస్తోందట. దీనికి ఆధారాలు ఏం లేకున్నా మీడియా మాత్రం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రకరకాల అనుమతులు ఆలస్యంగా వస్తుండటం , కొన్ని చోట్ల భూసేకరణ కష్టంగా మారటం, ఇలాంటి బోలెడు కారణాలు కూడా చెబుతోంది.
ఎల్ అండ్ టీ తన వాటా అమ్మేసి హైద్రాబాద్ మెట్రో నుంచి పక్కకు తప్పుకుంటే మొత్తం ప్రాజెక్టే ఆగిపోతుందా? అలాంటిదేం లేదు. కాకపోతే, ఇప్పటికే పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి వెనక్కి వెళ్లిపోవాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోందంటే చిక్కుముడులు చాలానే వున్నాయని అర్థం. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఛాలెంజెస్ ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల లోపు కేసీఆర్ మెట్రో సౌకర్యం హైద్రాబాదీలందరికీ కల్పిస్తే అది ఖచ్చితంగా గొప్ప విజయం అవుతుంది. లేదంటే సిటీలోని సిటీజన్స్ అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం వుంది. ఒకటి... మెట్రో రానందుకు, రెండు... మెట్రో పనుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు పోనందుకు!



.jpg)


