హృతిక్ రోష‌న్‌కు బ్రెయిన్ స‌ర్జరీ

posted on: Jul 8, 2013 10:46AM

 

Hrithik Roshan brain surgery, Hrithik Roshan's brain surgery successful

 

 

బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌కు బ్రెయిన్ స‌ర్జరీ జ‌రిగింది. ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు హృతిక్‌కు ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు డాక్టర్లు వెల్లడించారు. గతంలో ఓ షూటింగ్‌లో భాగంగా సీన్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా ప్రమాద‌వ‌శాత్తూ హృతిక్ రోష‌న్ త‌ల‌కు గాయమైంది. దీంతో ఆయ‌న‌కు బ్రెయిన్‌ స‌ర్జరీ చేయాల్సిందిగా గతంలో వైద్యులు సూచించారు. హృతిక్‌కు చేసిన ఆప‌రేష‌న్ చాలా చిన్నద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ మీడియాకు వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...