Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సంక్షోభం
posted on: Apr 15, 2026 10:37AM

భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇది ప్రధానంగా మద్యం సేవనంతో సంబంధం ఉన్న వ్యాధిగా భావించబడేది. కానీ ఇప్పుడు మెటబాలిక్ కారణాలు అంటే అధిక బరువు, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారకాలు అవుతున్నాయి.
1990 నుంచి 2023 వరకు దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి విస్తరణలో 23% పెరుగుదల ఉంది. అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు 23% కంటే ఎక్కువగా పెరిగాయి. నగర ప్రాంతాల్లో ఇది 9 నుంచి 32 శాతం పెరుగుదల ఉండగా, రాష్ట్రాల్లో అయితే ఏకంగా 60శాతం వరకూ చేరినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ ఎందుకు ప్రమాదకరం?
ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా పెరుగుతుంది. ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే చాలా మంది తమకు లివర్ సమస్య ఉందని తెలియకుండానే జీవిస్తున్నారు. కాగా ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి అన్నది యువతలో వేగంగా పెరుగుతోంది. ఇది ఇకపై మధ్య వయసు వారికే కాదు. పాతిక నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతలో కనిపిస్తున్నది.
మెటబాలిక్ కారణాలు ప్రధాన పాత్ర
- అధిక చక్కెర
- అధిక బరువు
- అధికంగా కూర్చునే పని చేసే జీవనశైలి
- ప్రాసెస్డ్ ఫుడ్
- ఫాస్ట్ ఫుడ్
- నిద్రలేమి
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలు.
ఒక్క ఇండియా అనే కాదు.. లివర్ ఫ్యాట్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో కరికి ఫ్యాటీ లివర్ ఉంది. 1990తో పోలిస్తే ఇది 143శాతం పెరుగుదల.
అయితే చాలా వరకూ లివర్ వ్యాధులు నివారించవచ్చు
- ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో పూర్తిగా నయం అవుతుంది
జీవనశైలిని మార్చడం ద్వారా లివర్ మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది
మందులు కంటే జీవనశైలి మార్పులు ఎక్కువ ప్రభావమంతం
ఫ్యాటీ లివర్ నివారణ : వైద్యుల సూచనలు
ఆహారపు అలవాట్లు మార్చుకోవడం
- తెల్ల బియ్యం, తెల్ల రొట్టె, చక్కెర పానీయాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ జ్యూస్ వంటివాటిని దూరంగా ఉంచడం, అలాగే.. అధిక నూనె, ఫ్రైడ్ ఫుడ్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం ద్వారా ఫ్యాటీ లివర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఇకబ్రౌన్ రైస్, మిల్లెట్స్, పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు, చేపలు వంటి ప్రొటీన్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, అలాగే, గ్రీన్ టీ, నిమ్మరసం, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అదే విధంగా రోజుకు కనీసం అరగంట ర్యాపిడ్ వాక్, యోగా, సైక్లింగ్,స్విమ్మింగ్, వ్యాయామం వంటి వాటిని చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ కు దూరం కావచ్చు. కాలేయం ఆరోగ్యానికి ఇవన్నీ ఎంతో మంచివి. ఇక పోతే.. రువు తగ్గడం అత్యంత ముఖ్యమైనది. 5 నుంచి పది శాతం బరువు తగ్గినా కాలేయంలోని కొవ్వు 50 శాతం వరకూ తగ్గుతుంది. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి మద్యపానం అత్యంత ప్రమాదకరం.
ఏడాదికి ఒక సారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవాలి. అవసరం అయితే ఫైబ్రో స్కాన్ చేయించుకోవాలి. సరిపడా నిద్ర అంతటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కాలేయ ఆరోగ్యానికి చాలా మంచింది. అలాగే రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం లివర్ డిటాక్సిఫికేషన్ కు దోహదపడుతుంది.
- పొట్ట భాగంలో అధిక కొవ్వు ఉన్నవారు
- డయాబెటిస్ ఉన్నవారు
- పీసీఓఎస్ ఉన్న మహిళలు
- అధిక బరువు ఉన్నవారు
- రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేసే వారు
- ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారు
ఫాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశలు ఎక్కువ ఉన్నవారిగా చెప్పవచ్చు.
చివరిగా చెప్పాలంటే.. ఫ్యాటీ లివర్ ఒక నిశ్శబ్ద మహమ్మారి. అయితే ఇది పూర్తిగా నివారించగలిగిన వ్యాధి. ఆహారం, లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉందంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే.
సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని


.webp)



