Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గురుగ్రామ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్లు హతం.!
posted on: Jul 10, 2026 10:51AM
.webp)
దేశ రాజధాని ప్రాంత (NCR) పరిధిలోని పారిశ్రామిక నగరం గురుగ్రామ్‌లో గురువారం (జులై 9) అర్ధరాత్రి జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్ స్టర్లు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో నేరగాళ్లను పట్టుకునే క్రమంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. నివాస ప్రాంతాల మధ్య జరిగిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి.
ఎస్‌జీటీ (ఎస్జీటీ) యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడు, ఒక ప్రముఖ వ్యాపారవేత్తను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటూ అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్ నడుపుతున్న గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరుతో ఈ ముఠా భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే.. గురువారం (జులై9) రాత్రి ఒక ఎస్‌యూవీ వాహనంలో అత్యాధునిక మారణాయుధాలతో వచ్చిన సాయుధ దుండగులు సదరు వ్యాపారవేత్త నివాస సమీపంలోకి చేరుకున్నారు.వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసేలా దుండగుల ముఠా ఒక్కసారిగా ఆయన ఇంటిపై కాల్పులు జరపడం ప్రారంభించింది.
అయితే.. ఈ ముఠా కదలికలపై ముందే నిఘా ఉంచిన గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వాహనాలను చూసిన గ్యాంగ్‌స్టర్లు లొంగిపోవడానికి బదులుగా, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు అక్కడికక్కడే మరణించగా, మరో గ్యాంగ్ స్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
Gurugram encounter, gangsters killed, Deepak Nandal gang, police firing






