Latest News
అనుమానాస్పద స్థితిలో గజరాజు మృతి
posted on: Jan 20, 2026 9:08AM
.webp)
చిత్తూరు జిల్లాలో ఓ గజరాజు అనుమానాస్పద స్థితిలో మరణించింది. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పంటపొలాల్లో ఎనుగు మరణించి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. అయితే ఏనుగు మృతికి కారణాలపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఏనుగుకు కరెంట్ షాక్ పెట్టి చంపేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా పలమనేరు నియోజకవర్గం కౌండిన్య అటవీ పరిధిలో కొన్ని ఏనుగులు మరియు కరెంట్ షాక్ వలన చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఏనుగు మృతికి అనారోగ్యం కారణమా? ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించిందా? లేక ఉద్దేశ పూర్వకంగానే ఎవరైనా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారా అన్నది తేలాల్సి ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల కారణంగా పంటలు ధ్వంసం అవుతున్నాయన్న కారణంగా ఎవరైనా కంరెంట్ షాక్ తో ఏనుగును చంపేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.



.webp)


