ఢిల్లీలో డీఆర్‌ఐ మెగా ఆపరేషన్.. రూ.120 కోట్ల సిగరెట్ల సీజ్

posted on: May 22, 2026 9:05AM

 

దేశవ్యాప్తంగా అక్రమ సిగరెట్ స్మగ్లింగ్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) భారీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ కేంద్రంగా సాగిన ఈ మెగా ఆపరేషన్‌లో ఒక కోటి కాదు రెండు కోట్ల కాదు... సుమారు రూ.120 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని కీలక పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలను అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ ముఠా చాలా తెలివిగా అధికారుల చేతికి చిక్కకుండా  రకరకాల పద్ధతుల్లో చైనా నుంచి భారీగా సిగరెట్లను దేశంలోకి తరలిస్తున్నట్టు డీఆర్‌ఐ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే డీఆర్‌ఐ బృందాలు..గత 15 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ ముఠాలపై నిఘా పెట్టారు.

సముద్ర మార్గం, విమాన మార్గం రెండింటినీ ఉపయోగిస్తున్న స్మగ్లర్ల కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఫర్నిచర్ కంటైనర్ల మాటున విదేశీ సిగరెట్లను దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి ముఠా వ్యవహారాన్ని గుట్టును రట్టు చేసి...మూడు లక్షలకుపైగా సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఒకేసారి దాడులు నిర్వహించి...సుమారు రూ.120 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు...దేశ వ్యాప్తంగా జరిగిన ఈ దాడులు స్మగ్లింగ్ నెట్‌ వర్క్‌ను కుదిపేశాయి. సీజ్ చేసిన సిగరెట్ల మూలాలు, అంతర్జాతీయ లింకులు, దేశంలో పంపిణీ చేస్తున్న నెట్వర్క్‌పై డీఆర్‌ఐ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...