విజయారెడ్డి కేసులో డిప్రెషన్ వార్తలను ఖండించిన పోలీసులు
posted on: Feb 7, 2026 2:00PM

ఇద్దరు పిల్లలతో కలిసి తొమ్మిది రోజుల క్రితం చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్ వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. మేడ్చల్ జిల్లా చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్ చెక్కులు, చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి ఫోన్ కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు. విజయాశాంతిరెడ్డి డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుందని కొన్ని ఛానెళ్లలో వస్తున్నా వార్తాలను పోలీసులు ప్రాథమికంగా ఖండించారు. ఆమె పనిచేసే ఆఫీసులో 16 మందితో పాటు, బంధువులను విచారించగా ఎలాంటి అనుమానాస్పద లీడ్ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేవని ప్రాథమిక విచారణలో తేలిందని అసలు కారణాలు ఇంకా మిస్టరీగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు తమ సోదరి చావుకు తామే కారణమని కథనాలు ప్రచురిస్తున్న మీడియా ఛానెళ్లపై పోలీసులకు విజయశాంతి రెడ్డి సోదరుడు చిరంజీవిరెడ్డి ఫిర్యాదు చేశారు.
మా చెల్లిని, ఆమె పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవాన్నని, ఆమె చావుకు మేమెలా కారణం అవుతామని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఛానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే, తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.
మాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేయడానికి వస్తే కోర్టుకు వెళ్లాలని పోలీసులు సలహా ఇచ్చారు. అసత్య ప్రచారం చేసిన ఛానెల్స్‌పై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తాం’’ అని చిరంజీవి తెలిపారు.



.webp)


