Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని మోదీని లోక్ సభకు రావద్దని చెప్పాను : స్పీకర్ ఓం బిర్లా
posted on: Feb 5, 2026 3:47PM

ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నందున ప్రధాని మోదీని లోక్ సభలోకి రావద్దని తాను విజ్ఞప్తి చేశాను అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కొందరు ప్రతిపక్ష ఎంపీలు ప్రధానిని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాని స్పీకర్ తెలిపారు. మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని సభాపతి అన్నారు.
అదే జరిగుంటే దేశ గౌరవం దెబ్బతినేది. నిన్నటి ఘటన పార్లమెంట్ చరిత్రలో మాయని మచ్చ అని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రధాని సమాధానం లేకుండానే ఆమోదం పొందింది. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చర్చకు విఘాతం కలగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.






