Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శోభనం రాత్రి షాకిచ్చిన పెళ్ళికూతురు...రూ.90 లక్షలు ఇస్తేనే అంటూ కండిషన్!
posted on: Apr 16, 2026 9:55PM

పెళ్ళి అంటే నూరేళ్ళ పంట.. రెండు కుటుంబాల కలయిక. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక వివాహం మాత్రం ఊహించని మలుపు తిరిగింది. పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్త ముందు వింత కండిషన్ పెట్టి అందరినీ విస్తుపోయేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని జగదీష్‌పురా పరిధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వివాహం ముగిసిన తర్వాత తొలి రాత్రి సమయంలో వధువు తన భర్తను భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసింది. దీనికి వరుడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వధువు తన పుట్టింటి వారికి సమాచారం అందించడంతో, వారు అబ్బాయి ఇంటికి చేరుకుని నానా హంగామా సృష్టించారు.
వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటిపై దాడి చేసి అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా, వరుడి కుటుంబాన్ని గదిలో పెట్టి బయట నుంచి తాళం వేశారు. గ్యాస్ పైప్‌లైన్‌ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేయడం ద్వారా ఇంటిని పేల్చివేసి అందరినీ సజీవ దహనం చేయాలని ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారు గమనించి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఘర్షణ అనంతరం వధువు తన వెంట తెచ్చుకున్న బ్యాగులతో పాటు, అత్తగారింట్లోని విలువైన బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పరారైంది. ఈ దాడిలో వరుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కేవలం డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ఈ పెళ్ళి చేసుకున్నట్లు వధువు తన నోటితోనే చెప్పిందని బాధితులు పోలీసులకు వెల్లడించారు.
ప్రారంభంలో పోలీసులు కేసు నమోదుకు నిరాకరించినప్పటికీ, బాధితులు కోర్టును ఆశ్రయించడంతో జగదీష్‌పురా పోలీసులు రంగంలోకి దిగారు. వధువు, ఆమె తండ్రి మరియు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పెళ్ళి కుదిర్చిన మధ్యవర్తి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న వధువు కోసం గాలిస్తున్నారు. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన మోసమా లేక దీని వెనుక ఏదైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అమాయక యువకులను పెళ్ళి పేరుతో బురిడీ కొట్టించే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.





