బీజేపీ ఓట్ల చోరీ నుంచి సీట్ల చోరీకి దిగజారిందన్న రేవంత్

posted on: Jun 10, 2026 11:30AM

రాజ్యసభ ఎన్నికల వేళ  దేశ  రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  రాజ్యసభ బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై  తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని  స్పష్టం చేశారు. అసలు ఎలాంటి తప్పు లేకపోయినా సాంకేతిక కారణాలు వెతికి మరీ నామినేషన్‌ను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని  ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది  చీకటి రోజని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంపై జరిపిన దాడి అని రేవంత్ రెడ్డి అన్నారు.  

కాగా మీనాక్షీ నటరాజ్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికీ,  తెలంగాణలోని ఒక   సివిల్ వివాదానికీ లింక్ ఉంది. గతంలో తెలంగాణకు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని   బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లోని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఓట్ల దొంగతనానికి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ స్థానాలను దక్కించుకోవడానికి  సీట్ల దొంగతనానికి' తెగబడిందని  విమర్శించారు. కేవలం అపవాదులు సృష్టించి ప్రతిపక్షాల అభ్యర్థులను రేసు నుంచి తప్పుకునేలా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని   మండిపడ్డారు.

మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్   ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కాంగ్రెస్ బృందం తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని   కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే..  ఆ బృందం ఈసీ అధికారులను కలవకుండా అడ్డుకున్నారు.   దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం కోసం త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టులోనే  తేల్చుకుంటామని అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఉండగా.. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అంతర్గత నేతలే తమకు స్వయంగా అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన నామినేషన్ రద్దుపై స్వయంగా మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ..  దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, ఎలాగైనా ఏకపార్టీ పాలనను స్థాపించాలనే ఏకైక దురాలోచనతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...