Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆషాడం బోనాల జాతర షురూ.!
posted on: Jul 16, 2026 8:32AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యంత ప్రారంభమైంది. గురువారం (జులై 16) భాగ్యనగరంలో ఈ వేడుకలకు ఘనంగా అంకురార్పణ చేసుకున్నాయి. మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల ఉత్సవాల శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల పండుగ ఒక ఉత్సవం మాత్రమే కాదనీ, అది సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఐక్యతను, సహోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
బోనాల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. దేవాదాయ శాఖ పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాల్లో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు.
ఆలయ ప్రాంగణాల్లో పారిశుధ్యం, నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు వంటి కీలక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Ashada Bonalu Hyderabad, Revanth Reddy Bonalu Greetings, Greater Hyderabad Festivals, Bonalu Festival Budget, Telangana Culture


.webp)



