రాష్ట్ర విభజన లోకజ్ఞానం!
posted on Apr 5, 2014 2:47PM
.jpg)
‘‘గురువర్యా’’
‘‘ఏంటి శిష్యా?’’
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం చివరికి ఏమి కాబోతోంది? ఏం జరగబోతోందా అన్న టెన్షన్‌తో నేను అల్లాడిపోతున్నా. మీ దివ్యదృష్ణితో చూసి భవిష్యత్తులో జరిగేదోంటో కాలజ్ఞానం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి’’
‘‘ఈ విషయం చెప్పడానికి కాలజ్ఞానం ఎందుకు శిష్యా? లోకజ్ఞానం చాలు’’
‘‘అయితే ఆ లోకజ్ఞానం ఏంటో చెప్పేయండి గురువర్యా’’
‘‘చెప్తా విను శిష్యా.. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే తాను అనుకూలంగా వున్నట్టు కలరింగ్ ఇస్తుంది. తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తర్వాతే అసలు ట్విస్టు వుంటుంది’’
‘‘ఏంటా ట్విస్టు గురూజీ?’’
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని కోర్టు చెబుతుంది. దాంతోపాటు అనేక న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలు బయటకి వస్తాయి. అప్పుడు విభజన ప్రక్రియ సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ తెలంగాణ బిల్లును రూపొందించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో చర్చించాలని డెసిషన్ వస్తుంది’’
‘‘నిజంగా ఇలా జరుగుతుందంటారా గురూజీ?’’
‘‘వేచి చూడు నాయనా’’....!