Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరక మంచికే..ప్రత్తిపాటి బిందాస్...
posted on: Mar 25, 2017 10:20AM

ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకు సైతం సీఎం చంద్రబాబు గ్రేడింగ్..ర్యాంకింగ్ మొదలెట్టారు. ఎవరెవరు ఎట్టాగా పనిచేస్తున్నారబ్బీ అని వాళ్ల వాళ్ల డేటాను సర్వే గ్రైండర్ల వేసి చట్నీ చేస్తున్నారు. ఎక్కడైనా రాయి తగిలిందో..ర్యాంకింగ్ మటాష్.. మస్కాలకు హస్క్‌లకు అతివినయాలకు తావులేదు. సర్వే రిపోర్ట్‌కు ఎదురులేదు. దీంతో మాన్యమంత్రివర్యుల్లో ఎప్పుడు ఎవరు ఊస్టవుతారోననే గుబులు మొదలైనా అంతా గుంభనంగా పనులు నెట్టుకొస్తున్నారు. ఎవరి సంగతి ఎలా వున్నా ప్రస్తుతానికైతే ప్రత్తిపాటి బెర్త్‌కు ఢోకాలేదు. ఇప్పుడు ఆయన పొజిషన్ మార్కెట్‌లో నెంబర్ వన్ మార్క్ పత్తిబేళ్లలా స్ర్టాంగయిపోనాది మరి. అనుకున్నదొక్కటి ..అయిందొక్కటి అన్నట్టు జగన్ బ్యాచ్ బుల్ బుల్ పిట్టలా బోల్తాపడిపోనారు కదా. అదే ప్రత్తిపాటికి ఫెచ్చింగయి కూర్చుంది. ఏ ..బీకి అమ్మాడు..సీ ..బీ దగ్గర కొన్నాడు..
క్రయవిక్రయంబుల్ ఎట్టా జరిగినాయో కానీ అగ్రిగోల్డ్ ఇష్యూను జాయింట్ వీల్‌గా చేసుకోవాలనుకున్న.. జే .. ఈ వీల్‌లోనే ఇరుక్కుపోయారు. ముందుకు పోలేక.. వెనక్కి రాలేక ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి..నోటుకు కోట్లు అంశాలను తెరపైకి తెచ్చినా ఔట్‌పుట్ డౌట్ లేకుండా ఫేడవుటయింది. యనమలంతటి రాజకీయ దిగ్గజం ఇట్టాంటి ప్రతిపక్ష నేతను ఎన్నడూ సూడలేదన్నాడంటే జగన్ ఏపాటి రాటు తేలాడో ఇట్టే అర్ధమవుతుంది. కానీ ఒంటేలు మార్క్‌తో కూసింత అప్పర్ హ్యాండ్ అన్పించుకున్న జగన్‌కు ఆ సంతోషం ఎక్కువ సేపు నిల్వకుండా పోయింది. అడుసుతొక్కనేలా..కాలు కడగనేలా.. అన్నట్టు ఆగమాగంగా అగ్రిగోల్డ్ భూములు లాగేసుకున్నారని ఆఫ్‌కోర్స్ కొన్నారని మంత్రిప్రత్తిపాటిపై ఆరోపణలు చేశారు. హౌజ్‌కమిటీ కాదు జ్యూడిషియల్ కమీటీ వేయాలన్నారు.
టైమింగ్ తో పావులు కదిపిన సీఎం చంద్రబాబు..ఏ కమిటీకైనా రెడీ అనడంతో జగన్ వర్గం గొంతులో వెలక్కాయపడినట్టయింది,సీఎం అంత స్ట్రాంగ్‌గా ముందుకెళ్లారంటే ఏదో మతలబు ఉండనే ఉంటది. ప్రత్తిపాటి మిస్టర్ క్లీన్ అని ముందే రిపోర్ట్ అందిందా? లేక ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు జగన్‌ను ఇరుకున పెట్టడంతో పాటు అటు ప్రత్తిపాటికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే స్కెచ్చేశారా? ఈడౌట్ ఎందుకంటే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఈ మాటలతోనే మీడియా చెవులు కొరికారు.చెవిరెడ్డి ఆరోపణల సంగతి ఎలా వున్నా..అగ్రిల్యాండ్స్ ఇష్యూలో జగన్ కన్నా బాబు ఎక్కువ స్టడీ చేశారని స్పష్టమైంది.
అంత పక్కాగా డేటా వుంది కాబట్టీ సీఎం చంద్రబాబు జ్యూడీషియల్ కమిటీ అస్త్రం సంధించారా?లేదంటే జ్యూడీషియల్‌పై బాబుకు ఎంత పట్టుందో బాగా తెలిసిన వ్యక్తిగా జగన్ కావాలనే మెత్తబడ్డారా? ఏది ఏమైతేనేం.. అగ్రిమంటల్లో ప్రత్తిపాటి విధేయతకు మరింత రాటు దేలింది. మరక మంచిదే అన్నట్టు బాస్ దగ్గర ఆయనకు బాగానే మార్కులు పడ్డాయి. రేసుగుర్రంలా ఎగిరిపడుతున్న విపక్షానికి కళ్లెం వేయడానికి ప్రత్తిపాటి విషయం బాగా కలిసొచ్చింది. మరక ప్రత్తిపాటికి అచ్చిపాటిగా మారిందనే టాక్ విన్పిస్తోంది.


.jpg)
.jpg)


