అజ్మీర్ దర్గా పేలుడు.. దోషులకు జీవితఖైదు..

posted on: Mar 22, 2017 3:01PM


అజ్మీర్ దర్గా పేలుళ్లు కేసులో నిందితులకు ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న దోషులు భవేశ్ పటేల్, దేవేంద్ర గుప్తాలకి ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో  ఎన్ఐఏ కోర్టు  మొత్తం ముగ్గుర్ని దోషులుగా గుర్తించగా... మరో ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటించారు. అయితే ముగ్గురు దోషుల్లో మూడవ దోషిగా ఉన్న సునీల్ జోషి 2007 డిసెంబర్ లో మర్డర్ అయ్యారు. దోషులు గతంలో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారకులు. కాగా 11 అక్టోబర్, 2007న రంజాన్ మాసంలో దర్గా వద్ద పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడు వల్ల ముగ్గురు మృతిచెందగా... 17 మంది గాయపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...