మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
posted on: Feb 3, 2026 8:37PM

మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అహ్మద్ పాషా ఖాద్రీకి ఏఐఎంఐఎం పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన సహచరుడిగా పేరొందిన పాషా ఖాద్రీ దశాబ్దాలుగా పార్టీ జనరల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.2023 అసెంబ్లీ ఎన్నికల ముందు యువ నాయకత్వానికి అవకాశం కల్పిస్తూ యాకుత్‌పురా సీటు నుంచి తప్పుకున్నారు. ఆయన మృతితో పాతబస్తీ రాజకీయాల్లో, ముఖ్యంగా ఎంఐఎంలు పార్టీలో తీరని లోటు ఏర్పడింది. పాషా ఖాద్రీ మరణంపై పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు


.webp)
.webp)


