Latest News
ఉత్తరాఖండ్‌ను ఊదేశారు
posted on: Mar 11, 2017 4:34PM
.png)
ఉత్తరాఖండ్‌లో హస్తానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసెంభ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ప్రభుత్వ వ్యతిరేకత కమలానికి భారీ విజయాన్ని కట్టబెట్టింది. హరీష్ రావత్ సర్కారుపై ఉన్న యాంటీ ఇన్‌కంబరెన్సీ కాంగ్రెస్‌ను కోలుకోలేకుండా చేసింది. హరీష్ రావత్‌పై ఉన్న వ్యతిరేకత ఓటు బీజేపీకి కలిసి వచ్చింది. అది ఎంతలా అంటే గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా... డబుల్ సీట్లను అధికంగా బీజేపీ దక్కించుకుంది. మొత్తం 50 సీట్లకు పైగా సాధించి విజయ ఢంఖా మోగించింది. ఎన్నికల ముందువరకు ఉత్తరాఖండ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు... రెబల్స్‌గా మారి బీజేపీకి సపోర్ట్ చేశారు. దీంతో రావత్ ప్రభుత్వం పడిపోవడంతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. దీనిని సవాల్ చేస్తూ రావత్ సుప్రీంకోర్టు మొట్లు ఎక్కారు...విజయం సాధించారు. రెబల్ ఎమ్మెల్యేలను లొంగతీసుకుని ప్రభుత్వన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకను మాత్రం రావత్ తగ్గించలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని పడేశారన్న సానుభూతి కూడా వర్కవుట్ కాలేదు. డీమానీటైజేషన్ ప్రభావం కూడా అస్సలు కనిపించలేదు. అధికార కుమ్ములాటలో కాంగ్రెస్ పడిపోవడంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. అంతే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అంతంత మాత్రమే చేయడంతో ప్రజల్లో కాంగ్రెస్‌పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇటు మోడీ మానియాతో పాటు... కాంగ్రెస్ వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చింది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ పర్వత రాష్ట్రంలో తొలిసారి బీజేపీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.


.jpg)
.jpg)


