Latest News
చమురు నౌకలకు హర్మూజ్ జలసంధి ఓపెన్!
posted on: Mar 30, 2026 12:17PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒకింత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొంత కాలంగా హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల ప్రయాణానికి ఇరాన్ ప్రభుత్వం అనుమతించడం ఇందుకు కారణం.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించినప్పటి నుంచీ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జలసంధి గుండా చమురు నౌకల రవాణాకు ఇరాన్ అనుమతించడంతో సోమవారం (మార్చి 30) దాదాపు 20 అయిల్ ట్యాంకర్లు ఈ మార్గం గుండా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.
ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇరాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇరాన్ ఒక గొప్ప దేశం అంటూ పొగిడారు. ఇరాన్ మమ్మల్ని గౌరవిస్తున్నదనీ, అందుకు తార్కానమే సోమవారం నుంచి చమురు నౌకలు హర్మూజ్ జలసంధి దాటేందుకు అంగీకరించడమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు భారీ ఊరట లభించిందనడంలో సందేహం లేదు. ఈ పరిణామం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఒక సానుకూల సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



.webp)


