Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైజింగ్ స్టార్ లోకేష్.. ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీ కథనం.!
posted on: Aug 10, 2026 10:09AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రైజింగ్ స్టారా? అంటే.. ప్రముఖ జాతీయ వ్యాపార పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' ఔననే అంటోంది. ఆ పత్రిక తన ఆగస్టు 2026 సంచిక కవర్ స్టోరీలో మంత్రి లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ గా అభివర్ణించింది. యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది. 2024 లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపడుతున్న విధివిధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలుకుతున్నాయని పేర్కొంది.
2024లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన క్షణం నుంచీ నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రాజెక్టు ఏపీ సాంకేతిక విప్లవానికి ఒక మైలురాయిగా నిలిచింది. అలాగే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ రంగాల్లో విదేశీ, స్వదేశీ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఫార్చ్యూన్ ఇండియా కథనం ప్రస్తుతించింది.
విదేశీ పర్యటనల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవడం లోకేష్ కార్యాచరణలో భాగమైంది. ఇటీవలి దక్షిణ కొరియాలో పర్యటనలో లోకేష్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం ఒప్పందాల స్థాయిలోనే కాకుండా, కంపెనీలకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయన తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు ఏపీ పారిశ్రామిక రంగ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
అదే విధంగా విద్యా రంగంలో కూడా నారా లోకేష్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల బదలీల్లో పారదర్శకత తీసుకురావడం, మెగా డీఎస్సీ ద్వారా వేల సంఖ్యలో టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పాఠశాలలకు రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలతో పాఠశాల విద్య నాణ్యతను పెంచే సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచడంతో పాటు, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు.
గతంలో అంటే 2014, 2019 మధ్య కాలంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో లోకేష్ రాజకీయ అనుభవం, మాట్లాడే తీరు, ప్రజలతో అనుసంధానమయ్యే విధానంపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ట్రోలింగ్, రాజకీయ సవాళ్లను దాటుకుంటూ ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రయాణంలో మైలురాయి అనడంలో సందేహం లేదు. ఆ పాదయాత్ర తరువాత లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు.
ఇప్పుడు అంటే 2024లో రెండో సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ లోకేష్ పాలనాపరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సాంకేతికతను ఉపయోగిస్తూ పాలనలో వేగం పెంచడం, జెన్ జీ, యువతతో నేరుగా సంభాషిస్తూ రాజకీయంలోకి వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకటనల కంటే ఫలితాల ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
Fortune India cover page story on Nara Lokesh, Andhra Pradesh Rising Star, AP IT Department, Nara Lokesh investments, Education Minister


.webp)



