Latest News

అమ్మ ఆరోగ్యంపై చేతులెత్తేసిన లండన్ డాక్టర్..

posted on: Dec 5, 2016 3:41PM

 

అమ్మ ఆరోగ్యం గురించి తమిళనాట ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అమ్మ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయగా..ఆస్పత్రి ఆవరణ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మ ఆరోగ్యం విషమంగానే ఉందని... ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని..వైద్యులు ప్రకటించారు. మరోవైపు  లండ‌న్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బేలె కూడా ప‌రిస్థితిని ప‌రిశీలించి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌య‌లలిత ఆరోగ్యం చాలా విష‌మంగా ఉంద‌ని.. జయ‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ప్రస్తుతం మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని.. అభిమానుల ప్రార్దనలే ఆమెను కాపాడాలని అన్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...