రేప్ చేసినాయనకి గెలుపు! నిరాహార దీక్ష చేసినామెకి ఓటమి!

posted on: Mar 11, 2017 12:38PM

 

ఇండియాలో ఎన్నికల్ని, ఎన్నికల ఫలితాల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం!  దాదాపు అసాధ్యం కూడా! తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సత్యం మరోసారి స్పష్టమైంది! అతి చిన్న రాష్ట్రం మణిపూర్ మొదలు అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ వరకూ ఈ సారి ఎన్నికలకు వెళ్లాయి. అయితే, యూపీలో ఎక్కడా లేనంత మంది కోటీశ్వరులు, క్రిమినల్స్ ఓట్ల యుద్ధంలో పోటీ పడ్డారు! అటు కాంగ్రెస్ కంచుకోట లాంటి మణిపూర్ లో కూడా ఈసారి బీజేపి బలంగా రంగంలోకి దిగింది! అంతే కాదు, ఏళ్లుగా నిరాహార దీక్ష చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా ఏకంగా ముఖ్యమంత్రి పైనే పోటీ చేశారు!

 

మణిపూర్ లో సైన్యానికి విపరీత హక్కులు వుండద్దంటూ షర్మిలా ఎన్నో ఏళ్లు ఆహార, పానీయాలు ముట్టకుండా దీక్ష చేసింది. అయినా ఏం లాభం లేకపోవటంతో ఈ సారి ఆమె ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని భావించారు. అయితే, డైరెక్ట్ గా సీఎం అభ్యర్థి ఒక్రామ్ ఐబోబిపై పోటీ చేశారు. దారుణంగా... 90ఓట్లు మాత్రమే సాధించి పరాజయం పాలయ్యారు!

 

జనం కోసం క్రుంగి కృశించిన షర్మిలా దారుణ ఓటమి చవిచూస్తే ఉత్తర్ ప్రదేశ్ లో ఒక ప్రబుధ్దుడు మాంచి లీడ్ లో వున్నాడు! ఆయన గెలవటం లాంఛనమే అంటున్నారు! అతనే ప్రస్తుతం పోలీస్ ల నుంచి తప్పించుకుని పరారీలో వున్న బడా క్రిమినల్ గాయత్రి ప్రజాపతి! ఎస్పీ అభ్యర్థిగా బరిలో వున్న ఆయన రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయినా ఆయన నియజకవర్గంలో జనం ఆయనకి భారీగా ఓట్లు వేసి అసెంబ్లీకి పంపే ఆలోచనలో వున్నారు! తమ నేత రేప్ చేశాడని ఆరోపణలు వచ్చిన లైట్ తీసుకునే జనం బహుశా మన దేశంలో తప్ప ఎక్కడా వుండరనుకుంటా! మరో వైపు జనం కోసం దీక్ష అంటూ పోరాటం చేసిన వ్యక్తికి మాత్రం మణిపూర్ ఓటర్లు 90 ఓట్లు మాత్రమే విదిల్చారు! ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!

google-ad-img
    Related Sigment News
    • Loading...