బాబ్లీ ప్రాజెక్టు పై సుప్రీం తీర్పు: ఎపికి ఎదురుదెబ్బ
posted on Feb 28, 2013 10:27AM
.jpg)
బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ పై ఆంధ్ర ప్రదేశ్ కు ఎదుదెబ్బ తగిలింది. మహారాష్ట్రకు అనుకూలంగా తీర్పు వెలువడింది. మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టును పూర్తిగా తొలగించలేమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.
ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్క ప్రతనిధి, చైర్మన్‌గా జలవనరుల సంఘం సభ్యుడి నియామకం జరుగనుంది.
అలాగే 2.47 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని వీడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ వాదనల అనంతరం బాబ్లీ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది.